English   

బాబాయ్ సరే...చరణ్ కా ఎన్టీఆర్ కా ?

NTR
2019-05-02 18:46:32

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్‌. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో వారిద్దరూ ఒకరు కొమురం భీమ్ గా మరొకరు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం త‌మిళ న‌టుడు..ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌నిని తీసుకున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ప్రెస్ మీట్ లో ప్రకటించారు. అయితే తాజాగా ఆయన పోషించే పాత్ర గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి బాబాయ్ గా స‌ముద్ర‌ఖ‌ని కనిపించనున్నాడట‌. అంటే కొమరం భీమ్ కి బాబాయ్ పాత్రను సముద్ర ఖని పోషించనున్నాడన్న మాట. కొమరం భీంలో స్వాతంత్రకాంక్షను రగిల్చిన పాత్రలో సముద్రఖని కనిపించనున్నాడని అంటున్నారు. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుం‍డగా, ఎన్టీఆర్‌ కు జోడిని ఫైనల్‌ చేయాల్సి ఉంది. అయితే అదలా ఉంచితే ఈయన చరణ్ కి బాబాయ్ గా నటిస్తున్నాడని కూడా గతంలో వార్తలు వచ్చాయి, దీంతో ఈయన బాబాయ్ గా నటించడం మీద అయితే క్లారిటీ వచ్చింది, కానీ అది చరణ్ కా లేక ఎన్టీఆర్ కా అనేది తేలాల్సి ఉంది. 

More Related Stories