English   

నయీం చేతిలో మర్డర్ అయిన గాయని పాత్రలో ప్రియమణి

priyamani
2019-05-02 20:10:03

నీది నాదీ ఒకే కథ డైరెక్టర్ వేణు ఊడుగుల రెండో సినిమా నటీనటుల జాబితాలో రోజుకో కొత్త పేరు చేరుతోంది. అయితే అలా వచ్చి చేరుతున్న ప్రతి పేరు ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తిని రేకెత్తిస్తోంది. రానా, సాయిపల్లవి జంటగా రానున్న సినిమానే విరాటపర్వం. ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంటే పల్లవి నక్సలిట్ గా నటిస్తోంది. హీరోయిన్ టబు  సామజిక కార్యకర్తగా నటిస్తుండగా ఆమెతో పాటు నటి ఈశ్వరి రావు, బాలీవుడ్ అలనాటి నటి జరీనా వహబ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక తాజా లిస్ట్ లో చేరిన ప్రియమణి తెలంగాణా జానపద గాయని బెల్లి లలిత పాత్రలో నటించనున్నారని అంటున్నారు. ఈ గాయని మావోయిస్టు నుండి గాయనిగా మారి నయీమ్ అనే గ్యాంగ్ స్టర్ చేతిలో హత్య చేయబడింది . ఆమెను ఎంతో క్రూరంగా చంపారు నయీమ్ గ్యాంగ్. మరి సాయి పల్లవి పాత్ర, రానా పాత్ర ఇప్పుడు ప్రియమణి పాత్రలు చూస్తుంటే ఇదేదో నక్సలైట్ ఉద్యమం నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని అర్ధం అవుతుంది.
 

More Related Stories