English   

సైరా సెట్ లో అగ్ని ప్రమాదం...మంటల్లో బూడిదయిన సెట్

Sye Raa Narasimha Reddy
2019-05-03 11:19:27

టాలీవుడ్ ప్రముఖ హీరో చిరంజీవికి చెందిన ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ మణికొండలోని ఆయన ఫాంహౌస్‌లో ఆయన ప్రస్తుతం నటిస్తున్న సైరాకి సంబందించిన సెట్  వేశారు. ఈ సినిమా కోసం కొద్ది రోజులుగా అదే సెట్ లో షూట్ జరుగుతోంది. ఈ క్రమంలో ఎలా సంభవించిందో తెలీదు కానీ ఆ సెట్ కి అగ్ని అంటుకుని మొత్తం బూడిద అయ్యింది. ఏమయ్యిందో ఏమో కానీ అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా బయటకు రాలేదు. షార్ట్ సర్క్యూట్ వలెనే అని భావిస్తున్నారు. దీని మీద మరింత సమాచారం అందాల్సి ఉంది. అయితే ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అయితే ఈలోపే సినిమా సెట్ దాదాపు బూడిదైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమా నిర్మాతకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద చరణ్ నిర్మిస్తున్నారు.

More Related Stories