English   

అప్పుడే రిలీజ్ కి రెడీ అవుతున్నారా ?

 Anand Devarakonda
2019-05-03 11:31:40

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న మూవీ దొరసాని. తెలంగాణా దొరలు వారి ఆకృత్యాలు ఈ మధ్యలో ఒక లవ్ ట్రాక్ అనుకుంటూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రాజశేఖర్ దంపతుల చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పెద్ద హంగూ ఆర్భాటం లేకుండా మొదలై ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ గడీల బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. పెళ్లి చూపులు నిర్మాత, విజయ్ మేనమామ యష్ రంగినేని - మధుర శ్రీధర్ రెడ్డి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తుండగా నూతన దర్శకుడు కెవిఆర్ మహేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. ఇప్పటివరకు కేవలం సినిమా టైటిల్ పోస్టర్ ని మాత్రమే రిలీజ్ చేసిన సినిమా యూనిట్ ఈసారి లుక్స్ లాంటివి లేకుండా ఏకంగా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని, వీలయినంత త్వరలో సినిమా రిలీజ్ కూడా  ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమా మీద ఇరు కుటుంబాల వారు ఆశలు పెట్టుకున్నారు. నిజానికి రాజశేఖర్ పెద్దకూతురు శివానీ అడివి శేష తో ఒక సినిమాలో నటిస్తుందని వార్తలు రావడమే కానీ దాని మీద ఇంకా అప్డేట్ లేదు, ఈలోపు ఆమె చెల్లి హీరోయిన్ కూడా అయిపోయింది.

More Related Stories