English   

వివాదాల్లోకి మా ని లాగకండి 

naresh
2019-05-03 12:08:16

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో నాగబాబు నరేశ్ ప్యానెల్ కు సపోర్టు చేస్తున్నట్టు  ప్రకటించిన విషయం తెలిసిందే. నాగబాబు చేసిన ఈ ప్రకటన తన గెలుపు మీద ప్రభావం చేసిందని దీనికి సరైన సమయంలో నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని  అప్పుడు ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న శివాజీరాజా కూడా పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదం మీద స్పందించిన ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్ ఈ వ్యాఖ్యలను ‘మా’ అధ్యక్షుడు హోదాలో కాకుండా ఓ సినీ నటుడిగా ఖండిస్తున్నానని, సినీ కుటుంబంలో కలిసి ఉండాల్సిన వాళ్ళం ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ప్రెసిడెంట్ నాగబాబు ఆ తరువాత మురళీ మోహన్, శివాజీరాజా చేశారు. అయితే నాగబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దారుణం. ఆయనకి అంగవైకల్యం, నడవలేకపోతున్నారంటూ కామెంట్స్ చేయడం ఆర్టిస్ట్ పర్సనల్ ఇమేజ్‌ ని డ్యామేజ్ చేయడమేనని నరేష్ అన్నారు. మా అధ్యక్షుడిగా పనిచేసిన నాగబాబు ఏం చేశారని కొందరు అడుగుతున్నారని ఆయన హయాంలో చాలా మంచి పనులు చేశారని గుర్తుచేశారు. ఆయన పిల్లికి బిచ్చం పెట్టలేదంటూ వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని, రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా, శివాజీ రాజా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్లకు పూర్తి సపోర్టు ఇచ్చి నిలబడ్డారని చెప్పుకొచ్చారు.  

More Related Stories