English   

ప్రీతీ కష్టాలు తీరేనా ?

Shalini Pandey
2019-05-03 13:21:52

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది షాలినీ పాండే. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో ఈ అమ్మాయికి వరుస ఆఫర్లు వస్తాయని, ఆమె కెరీర్ గ్రాఫ్ దూసుకుపోవడం ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా సక్సెస్ తరువాత ఒకటి రెండు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలను ఎంచుకుని దాదాపు ఫేడవుట్ హీరోయిన్స్ లిస్ట్ లో పడింది. అయితే ఈమధ్య వచ్చిన 118 సినిమాలో నటించినా ఈమె ఉందని కూడా ప్రేక్షకులు గుర్తించలేదు. అలా ఇబ్బద్నుల్లో ఉన్న ఈ అమ్మడికి మరో రొమాంటిక్ లవ్ స్టోరీలో అవకాశం దక్కిందని అంటున్నారు. రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణరెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో అవికా గోర్ చేయనున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయిని పక్కన పెట్టేసి షాలినీ పాండేను తీసుకున్నారా? లేదంటే అవికాతో పాటు షాలినీని కూడా తీసుకున్నారా? అనే విషయం మీద క్లారిటీ రావలసి వుంది. చూద్దాం ఈ సినిమా అయినా ఈ అమ్మడికి సినిమాలు తెచ్చి పెడుతుందేమో ? 

More Related Stories