English   

మహర్షి హక్కుల కోసం రంగంలోకి ?

 Thalapathy Vijay
2019-05-03 14:17:12

ఈ మధ్య కాలంలో ఒక బాషలో సక్సెస్ అయిన సినిమాలను వేరే బాషల్లోకి రీమేక్ చేస్తున్నారు. కాస్త హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు వేరే బాషలలో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయిన దాఖలాలు ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా ఒక సినిమా రిలీజ్ కాకుండానే ఆ సినిమా రీమేక్ చేయాలని భావిస్తూ రీమేక్ హక్కుల కోసం పోటీ పడడం కాస్త ఆసక్తికరంగా మారింది. మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మితమైన సినిమా మహర్షి. ఈ సినిమాని ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో స్టూడెంట్ గా రైతుగా సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవోగా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించే ఈ సినిమా మీద ముందు నుండీ భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో మహేశ్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరడం లాంచనమే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తమిళ రీమేక్ హక్కుల కోసం తమిళ స్టార్ హీరో విజయ్ దృష్టిపెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి గతంలో తెలుగులో మహేశ్ బాబు చేసిన పోకిరి, ఒక్కడు సినిమాలని ఆయన తమిళంలోకి రీమేక్ చేశారు. ఆ సినిమాలు ఆయనకి భారీ విజయాలతో పాటు రికార్డులను కూడా తెచ్చిపెట్టాయి. అందుకే మహర్షి సినిమా రీమేక్ మీద కూడా అప్పుడే విజయ్ దృష్టి సారించినట్టు చెబుతున్నారు. మరి దీనిలో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చూడాలి మరి.

More Related Stories