English   

నువ్వు తోపురా రివ్యూ

Nuvvu Thopu Raa
2019-05-03 15:50:36

శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధాకర్ కోమాకుల సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే, ఆ సినిమా తర్వాత సుధాకర్ చెప్పుకోదగిన పాత్రలు చేయలేదు. రెండు మూడు సినిమాల్లో నటించినా ఎప్పుడొచ్చాయో కూడా జనానికి తెలీదు. ఆయన తాజాగా హీరిగా నటించిన సినిమా నువ్వు తోపురా. ఆ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అయినా మనోడిని నిలబెడుతుందో లేదో రివ్యూలో చూద్దాం.  

కదేంటంటే :

హైదరాబాద్‌ సరూర్ నగర్‌కు చెందిన సూరి (సుధాకర్) చిన్నప్పుడే నాన్న చనిపోతాడు. నాన్న ఉద్యోగం అమ్మ (నిరోష)కు వస్తుంది. అటు ఉద్యోగం చేస్తూ ఇటు కొడుకు, కూతురు ఆలనా పాలనా చూస్తూ ఆమె జీవితాన్ని నెట్టుకొస్తుంది. ఆ క్రమంలో అమ్మ తనను సరిగా పట్టించుకోవడం లేదని సూరి చిన్నప్పటి నుంచే కోపం పెంచుకుంటాడు. తనకు నచ్చినట్టు ఉంటూ సరూర్ నగర్ గల్లీల్లో తిరుఉగుతూ జులాయిగా పెరుగుతాడు. ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేసి హితులతో కలిసి గాలికి తిరుగుతుంటాడు. ఇలాంటి సమయంలో సూరికి రమ్య (నిత్యా శెట్టి)తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కొన్ని కారణాల వల్ల సూరిని ఛీకొట్టి రమ్య అమెరికా వెళ్లిపోతుంది. సూరి కూడా అమెరికా వెళ్తాడు. అసలు సూరి అమెరికా ఎందుకు వెళ్తాడు ? అక్కడికి వెళ్లాక సూరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?  చివరికి అయినా తన తల్లిని అర్ధం చేసుకున్నాడా ? లేదా అనేదే సినిమా.

విశ్లేషణ :

రొటీన్ కథ...ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమా పడిపోతున్న మూస ధోరణిలో ఉందీ సినిమా. అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు తన తప్పు తెలుసుకుని జీవితంలో ఒక గోల్ ఏర్పరుచుకొని దాన్ని సాధించడం అనేది రోటీన్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ మాత్రం ఎలా అయినా తన లక్ష్యాన్ని చేరుకోవాలని చెడు చేయడానికి కూడా వెనుకాడని హీరో అనుకోకుండా మంచి పనులు చేసుకుంటూ వెళతాడు. చివరికి తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. అదీ స్థూలంగా సినిమా. ఇక ఈ సినిమాలో కథ, కథనం రెండూ ఆకట్టుకునేలా లేవు. అదీ కాక హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌ను దర్శకుడు ఎలివేట్ చేయలేక పోయారు. ఇక కధనం చాలా నెమ్మదిగా సాగతీయడం కూడా ఇబ్బంది కలిగించే అంశమే.

నటీనటుల విషయానికి వస్తే :

ఇది హీరో సినిమా,సినిమాను తన భుజాస్కందాలపై మోసే ప్రయత్నం చేశాడు సుధాకర్. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు, గల్లీ కుర్రోడి యాటిట్యూడ్ ఆకట్టుకుంటాయి. కానీ, పాత్రలో వేరియేషన్స్ చూపించడంలో మాత్రం సుధాకర్ కాస్త ఇబ్బంది పడ్డారనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా కోప్పడుతున్నట్టు చేసిన నటన పెద్దగా ఆకట్టుకోదు. ఇక రమ్య పాత్రలో నిత్యా శెట్టి నటన ఫర్వాలేదు. హీరో తల్లి పాత్రలో నిరోష ఆదరగోట్టగా మహేష్ విట్ట, జబర్దస్త్ రాకేష్, జెమిని సురేష్ తదితర నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. అలాగే చాలా కాలం తరవాత వెండితెరపై కనిపించిన వరుణ్ సందేశ్ తన నటనతో నవ్వించే ప్రయత్నం చేశారు.  సరేష్ బొబ్బిలి అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదనిచినా సినిమాటోగ్రఫీ దెబ్బకి సాల్ట్ లేక్ సిటీ చాలా అందంగా చూపించారు. 

చివరిగా..  ‘నువ్వు తోపురా’.. రొటీన్ సినిమా విత్ తెలంగాణా టచ్.

రేటింగ్ : 2 / 5

More Related Stories