English   

సైరా టైం బాలేదా ?

Sye Raa
2019-05-03 17:47:08

టాలీవుడ్ లో చిరు సైరా మూవి ఏ ముహూర్తన స్టార్ట్ చేసారోగాని షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. దురదృష్టం కొద్దీ కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సెట్‌తో పాటు ‘సైరా’ సినిమాకి సంబంధించిన సెట్ కూడా దగ్ధమైపోయింది. దీంతో షూటింగ్‌కు కొంత కాలం ఆటంకం ఎదురైంది. ఆ తర్వాత శేరిలింగంపల్లిలో వేసిన సెట్‌ ని అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో సెట్ వేశారనే కారణంతో ప్రభుత్వ అధికారులు కూల్చి వేయడం హాట్ టాపిక్ అయింది. ఈ కారణంగా కూడా ‘సైరా’ షూటింగ్ ఆగిపోయింది. ఇన్ని ఆటంకాలు ఎదురయ్యాక ఈ సెట్ ని తన సొంత ఫాం హౌజ్‌కు షూటింగ్ మార్చుకున్నారు చిరు. ఇప్పుడు అక్కడ కూడా అగ్నిప్రమాదం జరిగింది. అలా ఈ సినిమా ఒక్కడుగు ముందుకు పడితే నాలుగు అడుగులు వెన్నక్కి వెళ్లుతుంది. దసరాకి అంటున్నారు కానీ దసరాకి కూడా డౌటే ఈ ఆటంకాల వలన.

More Related Stories