English   

విరాటపర్వంలో మరో స్టార్ నటుడు

Nana Patekar may play key role in Virata Parvam 1992
2019-05-03 19:47:55

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న పీరియాడిక్ మూవీ విరాట‌ప‌ర్వం 1992. నీది నాది ఒకే కథతో మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి డి.సురేష్‌బాబు నిర్మాత. ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగే ఈ సినిమా గురించి రోజుకొక ఆసక్త్జికర అంశం బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రానా, సాయి పల్లవిలు నటిస్తుండగా మరోపక్క సీనియర్‌ కథానాయిక టబు, ప్రియ‌మ‌ణిలు కీల‌క పాత్ర‌ల‌లో నటిస్తున్న ఈ సినిమాలో వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు చేబుతున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ ఈ సినిమాలో విలన్ గా నటించానున్నారట. ఈయన పాత్ర మాత్రమే కాక ఈయనకు తోడు ట‌బు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందని అంటున్నారు. పాత్రల మీద అయితే ఇంకా క్లారిటీ రాలేదు కానీ నటీనటులు ఫైనల్ అయినట్టుగా చెబుతున్నారు; జూలైలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చూడాలి ఇక రానున్న రోజుల్లో ఇంకెన్నో పేర్లు రానున్నాయో ?

More Related Stories