English   

వాళ్ళ పెళ్ళికి నిత్యనే కారణమట

nithyamenon
2019-05-03 20:03:36

ఈ మధ్య కాలంలో నిత్యామీనన్ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె చేసిన చివరి తెలుగు సినిమా కధానాయకుడు, అది కూడా రెండు నిముషాల పాత్ర. అయితే తాజాగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నిత్యామీనన్ కీలక పాత్రలో ఛాన్స్ దక్కించుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. మరో పక్క ఆమెను మళయాళీ చిత్ర పరిశ్రమ నుండి ఆమెను నిషేదిస్తామని బెదిరింపులు, ఇలా తరచూ ఏదో ఒక వార్తతో వార్తల్లో నిలుస్తున్న ఆమె తాజాగా మళయాళ న‌టి నజ్రియా వివాహం ఫాహద్ ఫాసిల్ తో జరగడానికి కారకురాలిని తనేనని చెప్పుకొచ్చింది. మళయాళంలో బెంగుళూర్ డేస్ సినిమా చేసే ఛాన్స్ తనకు వస్తే ఆ సమయంలో నా డేట్స్ ఖాళీ లేకపోవడం వలన, నేను ఆ సినిమా చేయలేనని చెప్పానని దాంతో నాకు బదులుగా నజ్రియాను తీసుకున్నారని, ఈ సినిమా షూటింగు సమయంలోనే నజ్రియా ఫాహద్ ఫాసిల్ మధ్య పరిచయం ప్రేమగా మారడం పెళ్లి చేసుకోవడం జరిగిపోయిందని అలా తాను ఆ సినిమా చేయకపోవడం వల్లనే తమ పెళ్లి జరిగిందని నిత్య చెప్పుకొచ్చింది. అందుకే తాను ఎదురుపడినప్పుడల్లా నజ్రియా – ఫాహద్ ఫాసిల్ ఇదే విషయం చెబుతుంటారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే అప్పటికే ఆ సినిమా కోసం దుల్కర్ సల్మాన్, ఫాహద్ ఫాసిల్, నివిన్ పౌలి, పార్వతిని ఫైనల్ చేశారని కానీ తనకే డేట్స్ కుదరలేదని చెప్పుకొచ్చింది.

More Related Stories