English   

ఒకరు అమ్మగా....మరొకరు అత్తగా

vijay
2019-05-03 20:24:37

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న మూవీ మహర్షి. ఈ నెల 9న రిలీజ్ కానున్న ఈ సినిమా తర్వాత మహేష్ తన 26వ సినిమాని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో తెర‌కెక్కిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మాత‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబందించి రోజుకొక ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి, బండ్ల గణేష్ లను మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పిస్తున్నారని అలాగే మహేష్ కి విలన్ గా జగపతి బాబు నటిస్తున్నారని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. ఈ క్రమంలో ఇప్పుడు విజయశాంతి ఏ పాత్రలో కనిపించనుంది, రమ్యకృష్ణ ఏ పాత్రలో నటించానున్నది ఏమిటి అనే ఆత్రుత అందరిలోనూ మొదలైంది. అయితే సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాకాహ్రం ప్రకారం ఈ సినిమాలో మహేశ్ బాబుకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందనీ అత్త పాత్రను విజయశాంతి పోషించనుందనేది తాజా సమాచారం. ఈ రెండు పాత్రలకు ఎలివేషన్ గట్టిగా ఉంటుందట. ఇక ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. వెళ్ళాక గానీ క్లారిటీ రాదు వీరి వీరి పాత్రల మీద.

 

More Related Stories