English   

వైష్ణవ్ తేజ్ సినిమాకి రెండు టైటిల్స్

tej
2019-05-03 21:07:14

మెగా ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సుకుమార్ అసిస్టంట్ బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రీ లుక్‌ పోస్టర్ ఇప్పటికే రిలీజ్‌ అయ్యింది. తాజాగా ఈ సినిమా టైటిల్‌పై ఆసక్తికర వార్త టాలీవుడ్‌ లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాకు జాలరి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రీలుక్‌లో వైష్ణవ్‌ జాలరిగా కనిపించాడు. దీంతో ఈ ప్రచారం నిజమే అని అంటున్నారు. అయితే ఈ టైటిల్ గురించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. నిజానికి మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ మాత్రం త‌మ బ్యాన‌ర్‌పై ఉప్పెన అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేసి పెట్టి ఉంది. మ‌రి ఈ సినిమా అస‌లు టైటిల్ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించనున్నాడు.

More Related Stories