English   

అవెంజేర్స్ సినిమా చూసిన జగన్...గేమ్ ఎండ్ కాదట 

ysjagan
2019-05-04 07:26:19

గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనే పట్టుదలతో చాలా కష్టపడ్డాయి పాలక ప్రతిపక్షాలు, అందుకే ఆ తర్వాత నుండి జగన్ రిలాక్స్ అవుతున్నారు. ఈ మధ్యనే ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లోచ్చిన జగన్ తాజాగా ఈనెల 2న కుటుంబ సభ్యులతో కలసి అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూశారు. హైదరాబాద్‌లో హీరో మహేష్ బాబుకు సంబందించిన ఏఎంబీ థియేటర్లో సినిమా చూడటానికి జగన్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. మల్టీఫ్లెక్స్‌లోని స్క్రీన్ ఫైవ్‌లో ఉన్న అన్నీ హై ఎండ్ పుష్ బ్యాక్ సీట్లు జగన్ ఫ్యామిలీ కోసం బుక్ చేశారట. అయితే జగన్ ఇలా సినిమా చూడడం మీద సెటైర్లు వేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న ఫణి తుఫాన్‌ సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే జగన్ అవేంజర్స్ సినిమాకెళ్లడం గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా స్పందించిన ఆయన ‘చూడనివ్వండి.. సినిమాకి వెళ్తే వెళ్లనివ్వండి తుఫాను వస్తే ఏమి చేయాలో ప్రభుత్వం బాగా చేసుకుంటుంది, ఇక్కడుండి ఓట్లు వేసేవాళ్లు అమాయకులం కదా, ఆయన హైదరాబాద్‌లో ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అలాగే సినిమా ఎండ్ గేమ్ అవ్వచ్చు కానీ ఈ జగన్ గేమ్ ఎండ్ కాదుగా అని ఆయన సెటైర్లు పేల్చారు.   

More Related Stories