English   

మహర్షి సెన్సార్ టాక్

maharshi
2019-05-04 07:55:03

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా మహర్షి. పూజా హెగ్డె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కొంతకాలంగా హిట్స్ లేక సైలెంట్ అయిన అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ అమ్ధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు నిర్మాతలు. మహేష్ 25వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిన ఈ సినిమా మీద ముందు నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు, అశ్వినిదత్, పీవిపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సక్సెస్ అయింది, ఆరోజు విడుదలైన ట్రైలర్‌ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నసినిమాకి సెన్సార్ బోర్డు సింగిల్ కట్ లేకుండా యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంతే కాక రెండు గంటల 48 నిమిషాల మేరకు నిడివి వచ్చినట్లు తెలుస్తోంది. సెన్సార్ టాక్ ప్రకారం సినిమా చాలా బాగా వచ్చిందని.. మహేష్ కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సమ్మర్ కు ఇదే పెద్ద సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదిహేను వందల స్క్రీన్లకు పైగా సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

More Related Stories