English   

ఈ హీరోయిన్ పెళ్ళయ్యాక అరుపులు పుట్టిస్తోందే

meera
2019-05-04 08:08:07

చాలామంది స్టార్ హీరోయిన్లు కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా పెళ్ళి చేసుకుని సినిమాల నుండి రిటైర్ అయిపోయారు. అమల - నమ్రత శిరోద్కర్ - జ్యోతిక అందుకు ఎగ్జాంపుల్స్. కాని పెళ్ళయ్యాక రిటైరవ్వని హీరోయిన్లు మాత్రం డైవర్సుల దారిన పట్టేస్తున్నారు. అలనాటి హీరోయిన్ మీరా జాస్మిన్ విషయానికి వస్తే దాదాపు సౌత్ భాషలన్నిటిలో నటించింది ఆమె. 2016 లో పెళ్ళి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చి భర్త అనిల్ జాన్ తో కలిసి అమెరికాకు వెళ్ళి సెటిల్ అయిపోయింది ఈ భామ. అప్పటి నుంచి మీరా జాస్మిన్ కు సంబంధించిన న్యూస్ ఏదీ మీడియాలో రాలేదు, ఆమె సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ గా లేకపోవడంతో ఆమెకు సంబందించిన ఏ విషయం పెద్దగా హైలైట్ కాలేదు. అయితే చాలా రోజుల తర్వాత మీరా జాస్మిన్ ఫోటోలు సోషల్ మీడియాలోకి అవి క్షణాల్లో వైరల్ కావడం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగానే మారింది. అయితే ఈ ఫోటోలు మీరా జాస్మిన్ సోదరి వివాహం సందర్భంగా తీసినవని చెబుతున్నారు. ఇంతకు మునుపు మీరా కాస్త లావుగానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం స్లిమ్ గా హీరోయిన్ మెటీరియల్ లా తయారయ్యింది. నిజానికి పెళ్లి తర్వాత అందరూ బరువు పెరుగుతారని అంటూ ఉంటారు కానీ మీరా జాస్మిన్ మాత్రం స్లిమ్ గా మారి షాక్ ఇచ్చింది. ఆమె వైరల్ అయిన ఫోటోలలో ఆమె మలయాళ హీరో దిలీప్ తో ఫోటో దిగినట్టు ఉండడంతో  ఇప్పుడు దిలీప్ – మీరా జాస్మిన్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుందని ప్రచారం మొదలయ్యింది. చూడాలి మరి ఏమవనుందో ?

More Related Stories