English   

వర్మ బయోపిక్...ఎర్రగడ్డకు దారేది ?

RGV
2019-05-04 10:34:16

ఈ సోషల్ మీడియా విపరీతంగా అందుబాటులోకి వచ్చాక రాత్రికి రాత్రి సేలేబ్రిటీలుగా మారుతున్నారు. అయితే అందులో కొందరు టాలెంట్ తో మారుతుంటే మరి కొందరు నోటి దురదతో మారిపోదామని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో ఒకరే దేవీ బాబు చౌదరి, ఇంతకీ ఈ దేవి బాబు చౌదరి ఎవరు అనుకుంటున్నారా .?  అప్పట్లో.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ విడుదలను ఆపాలంటూ రాష్ట్రా ఎన్నికల అధికారి రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేసిన ఈయన్ని కొన్ని ఛానల్స్ హీరోని చేయడంతో మైక్ దొరికితే వర్మపై నిప్పులు చెరుగుతున్నారు దేవి బాబు చౌదరి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంటర్నేషనల్ పిచ్చి సంఘం అధ్యక్షుడు కేఏ పాల్ అయితే అఖిల భారత పిచ్చ సంఘం అధ్యక్షుడు రామ్ గోపాల్ వర్మ అంటూ వ్యాఖ్యలు చేశారు ఆయన. చంద్రబాబు నాయుడ్ని ఎవరు కించపరిచినా ఊరుకునేది లేదని ఓరేయ్ వర్మా. నీ తాట తీస్తా అంతు చూస్తా అంటూ వార్నింగ్ లు ఇచ్చారు ఆయన. అంతే కాద్నదోయ్ ఊరకుక్క అరిస్తే ఎలా ఉంటుందో రామ్ గోపాల్ వర్మ మాట్లాడితే అలా ఉంటుందడంటూ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు ఆయన. వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ జగన్ కోసం తీసిందని రామ్ గోపాల్ వర్మకు పిచ్చిలేచి రకరకాల బయోపిక్‌లు తీస్తున్నారని త్వరలో వర్మ మీద బయోపిక్ తీస్తానని ప్రకటించారు దేవి బాబు. ఆ సినిమాకి ‘ఎర్రగడ్డకు దారేది’ టైటిల్‌ పెట్టి వర్మ పిచ్చిని ఈ సినిమాలో చూపిస్తానని పేర్కోన్నారాయన. 

More Related Stories