English   

మహానటికి అరుదైన ఘనత 

Mahanati
2019-05-04 10:59:25

 ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి నటించి వారి కంటే ఎక్కువ పారితోషకం అందుకున్న అలనాటి దిగ్గజ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘మహానటి’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. కీర్తిసురేష్ టైటిల్ పాత్ర‌లో న‌టించి దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా ద‌క్షిణాది స్టార్స్ నటించిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ తెరకేక్కించగా వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. తాజాగా ఈ సినిమా ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌నోర‌మ‌ విభాగంలో 22వ షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ (SIFF) మ‌హాన‌టిని ఎంపిక చేశారు. ఈ ఏడాది ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కింది. వేడుక‌ల్లో భాగంగా మెయిన్ లాండ్ చైనాలో ఈ సినిమా ప్రీమియ‌ర్‌ను ప్ర‌దర్శించ‌నున్నారు. గతేడాది మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది.

More Related Stories