English   

మైత్రి వారి నుండి క్యాస్టింగ్ కాల్

 Mythri Movie
2019-05-04 12:26:45

తెలుగులో తక్కువ కాలంలో చేసింది కొన్ని సినిమాలే అయిన మంచి పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీస్‌విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ వ‌రుస విజ‌యాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో డియ‌ర్ కామ్రేడ్, గ్యాంగ్ లీడ‌ర్, వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ చిత్రం,అల్లు అర్జున్ 20వ చిత్రం రూపొందుతున్నాయి. తాజాగా ఈ సంస్థ కాస్టింగ్ కాల్ ఇచ్చింది. 9 నుండి 11 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న అమ్మాయిలు మేక‌ప్ లేకుండా త‌మ ఫోటోల‌ని వాట్సాప్ చేయాల‌ని కోరింది. సినిమాలో న‌టించాల‌నే ఆస‌క్తి ఉన్న బాలిక‌లు ఈ ల‌క్కీ ఛాన్స్ వాడుకుని సినిమాల్లో మెరవాలని వారు పేర్కొన్నారు. న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్, మోహ‌న్ క‌లిసి స్ధాపించిన ఈ మైత్రి మూవీ మేకర్స్ లో రూపొందిన శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ , రంగ‌స్థ‌లం, చిత్ర‌ల‌హ‌రి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. మరి ఈ క్యాస్టింగ్ కాల్ అయితే ఏ సినిమా కోసం అనేది క్లారిటీ ఇవ్వలేదు.

More Related Stories