English   

మహర్షి సెన్సార్ రివ్యూ 

 Maharshi
2019-05-04 18:01:54

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన మహర్షి సినిమా భారీ అంచనాల నడుమ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ కెరియర్‌లో 25వ మూవీగా ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రేజీ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. ‘మహర్షి’ సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. 2.55 గంటల నిడివితో ఉన్న ఈ చిత్రంలో మహేష్‌ని స్టూడెంట్‌గా, బిలీనియర్‌గా, రైతుగా మూడు వైవిధ్యభరిత పాత్రల్లో మెస్మరైజ్ చేసేలా చూపించారట. అందుతున్న సమాచారం ప్రకారం ఫస్టాఫ్ లో మహేష్ బిజినేష్ మ్యాన్ లా కనిపిస్తాడట, ఒక కంపెనీకి సీఈవోగా ఉన్న మహేష్ ని ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మూలాలను గురించి అడగగా అక్కడితో ఫ్లాష్ బ్యాక్ మొదలువుతుందట, అక్కడ అల్లరి నరేష్, పూజ, వెన్నెల కోశోర్ ల కామెడీ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. అల్లరి నరేష్ ఒక రైతు బిడ్డ కావడంతో సెలవుల్లో స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తాడు. అయితే మహేష్ మాత్రం ఏమీ పట్టనట్టు వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటాడు, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉండే మహేష్ తన స్నేహితుడికి కష్టం వస్తే అక్కడి వారితో తలపడతాడు, మహేష్ ఊరు వదిలి వెళ్ళాక నరేష్ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటుంది, మహేష్ నరేష్ ని బతికించడానికి ప్రయత్నం చేస్తే, ఇది నా ఒక్కడి సమస్య కాదని అందరి రైతుల సమస్య అని పోరాడమని కోరతాడు. అయిది అప్పటికే అమెరికా ఉద్యోగం రావడంతో వెళ్ళిపోతాడు. అయితే ఇంటర్వ్యూ పూర్తయ్యాక  మహేష్ పూజకి కాల్ చేసి నరేష్ ఎలా ఉన్నాడని అడగగా ఆమె నరేష్ ని చంపేశారని చేబుతుంది. దీంతో తన తప్పు తెలుసుకున్న మహేష్ ఇండియా వచ్చి రైతుల కోసం నిలబడతాడు, ఇది స్థూలంగా కధ. ముఖ్యంగా క్లైమాక్స్ చూసిన తరువాత ప్రేక్షకులు బరువెక్కిన గుండెలతో థియేటర్స్ బయటకు వస్తారని ఎమోషనల్‌గా సాగే క్లైమాక్స్ ఈ చిత్రానికి హైలైట్ అంటున్నారు. 

More Related Stories