English   

విజయ్ సెట్ లో అగ్ని ప్రమాదం

vijay
2019-05-04 19:21:11

ఈ మధ్య కాలంలో జరుగుతున్న మూవీ సెట్స్‌లో వరుస అగ్ని ప్ర‌మాదాలు చిత్ర నిర్మాత‌ల‌ని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఈ వారంలోనే క‌ర‌ణ్ జోహార్ స్టూడియోలో అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌గా, నిన్న సైరా సెట్ అగ్నికి ఆహుతి అయింది. తాజాగా విజ‌య్ మూవీ సెట్ మంట‌ల‌లో పూర్తిగా కాలిపోయింది. దీంతో ల‌క్ష‌ల విలువైన సామాగ్రి, సెట్ అంతా బూడిద‌య్యిందని సమాచారం. విజ‌య్ ప్ర‌స్తుతం త‌న 63వ సినిమాని అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాని చెన్నై మీనంబాక్కంలోని బిన్ని మిల్లు ప్రాంతంలో ఆల‌యం, ఆసుప‌త్రి, మెడిక‌ల్ దుకాణం, పాఠ‌శాల సెట్ వేసి షూటింగ్ జ‌రుపుతున్నారు. అయితే దీనికి ప‌క్క‌నే మ‌రో సెట్ వేసే క్ర‌మంలో ఇనుప రాడ్ లకి  వెల్డింగ్ చేస్తున్నారు. వెల్డింగ్ చేసేటప్పుడు వ‌చ్చే నిప్పు ర‌వ్వ‌లు ప‌క్క‌నే ఉన్న ఎండిన ఆకుల‌పై ప‌డి మంటలు చెలరేగాయి, అవి క్ర‌మ‌క్ర‌మంగా పాకుతూ సెట్ అంత‌టా వ్యాపించాయ‌ట‌. దీంతో వెంట‌నే అక్క‌డ ఉన్న కార్మికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. అక్కడికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది సుమారు నాలుగు గంటల సేపు క‌ష్ట‌ప‌డి మంటలను అదుపుచేశారు. ఈ ఘ‌ట‌న గురువారం జ‌ర‌గ‌గా ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 

More Related Stories