English   

ఆమె బతికే ఉందట

muntaz
2019-05-04 20:15:04

బ‌తికి ఉన్న సెలెబ్రిటీలను చంపడం కొన్ని యూట్యూబ్ అలాగే వెబ్ సైట్స్ వారికి అల‌వాటుగా మారింది. పూర్తి స‌మాచారం తెలుసుకోకుండానే ప్ర‌ముఖ వ్య‌క్తులు చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియాలో వారు పోస్ట్‌లు పెట్టడం, వాటిని బేస్ చేఉస్కుని మీడియా కధనాలు వండి వడ్డించడం ఈక్రమంలో అభిమానులు ఆందోళ‌న పడడం మామూలు అయిపొయింది. తాజాగా పాత‌త‌రం హీరోయిన్ ముంతాజ్ ముంబైలోని ఆసుప‌త్రిలో గుండెపోటుతో చ‌నిపోయిందంటూ ట్వీట్ చేశారు సినీ, ట్రేడ్‌ అనలిస్ట్‌ కోమల్‌ నాహ్తా. దీంతో నెటిజ‌న్స్ ఆమె ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని రిప్ లు పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఇదంతా నిజం కాదని బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మిలాప్ జ‌వేరి త‌న ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ముంతాజ్ ఆంటీ వాళ్ళ మేన‌ల్లుడితో మాట్లాడాను. ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. పుకార్ల‌ని ఖండించాల‌ని ఆమె కోరారని   మిలాప్ త‌న ట్వీట్‌లో తెలిపాడు. అయితే విష‌యం తెలుసుకున్న కోమ‌ల్ త‌న ట్వీట్ డిలీట్ చేస్తూ క్ష‌మాప‌ణ‌లు కోరారు. బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చిన ముంతాజ్ 70వ ద‌శకంలో టాప్ డ్యాన్స‌ర్‌లో ఒకరిగా గుర్తింపు పొందారు. 

More Related Stories