English   

సింగర్ జానకికి అస్వస్థత

janaki
2019-05-04 21:28:54

ప్రముఖ సింగర్ ఎస్ జానకిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. గత కొద్దిరోజులుగా కాలి నొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హస్పిటల్ చేర్చారు. శనివారం ఆమెను మైసూరులోని ఓ ప్రయివేటు హస్పిటల్ లో అడ్మిట్ చేశారని సమాచారం. ప్రస్తుతం ఆమె ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల బంధువుల ఇంట్లో ఉండగా జానకి కాలుజారి పడిపోవడంతో ఆమె  కుడి కాలికి  ఫ్రాక్చర్‌ అయిందట
దీంతో నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆమెను హస్పిటల్ లో జాయిన్ చేసినట్టు సమాచారం. గాన కోకికలగా బిరుదు సంపాధించుకున్న జానకి దాదాపు అన్ని భాషల్లోనూ పాటలు పాడారు. కాగా ఆమె వయసు ప్రస్తుతం 80. సంవత్సరాలు.

 

More Related Stories