English   

డిస్కో రాజా ఏమయ్యిందో ..వెంటపడుతున్నారు

discoraja
2019-05-05 08:25:29

వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజ తాజా సినిమాగా డిస్కోరాజా తెరకేక్కుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. క్షణం దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగు ఆగిపోయిందని అందుకే రవితేజతో తమ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి కొంతమంది దర్శకులు రంగంలోకి దిగారని చెప్పుకుంటున్నారు. ప్రచారం జరుగుతున్న దానిని బట్టి ఆ జాబితాలో అజయ్ భూపతి, గోపీచంద్ మలినేని, సంపత్ నంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తమ దగ్గరున్న కథలతో రవితేజను ఒప్పించడానికి ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దర్శకులు వెంట పడుతున్నారు సరే కానీ అసలు సమస్య ఏంటంటే ఎవరు రవితేజతో సినిమా చేయాలనుకున్నా కనీసం ముఫై నుంచి ముఫై అయిదు కోట్ల బడ్జెట్ కావాలి. కానీ మనోడికి అంత మార్కెట్ లేదు. మరి ఈ ముగ్గురు దర్శకులలో రవితేజను ఎవరు ఒప్పిస్తారో ఎవరు నిర్మాతని ఒప్పిస్తారో అనేది చూడాలి.

More Related Stories