English   

తొమ్మిది గెటప్స్ తో కోమలి

jayam ravi
2019-05-05 08:38:39

తమిళంలో స్టార్ హీరోల జాబితాలో జయం రవి ఇకరు, తెలుగు జయం సినిమా తమిళ రీమేక్ లో హీరోగా నటించి స్టార్ హోదా సాధించిన ఆయన మొదటి నుంచి వైవిధ్యభరితమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. జయం రవి తాజా సినిమాగా తమిళ్ లో కోమలి సినిమా రూపొందుతోంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా, ప్రదీప్ రంగనాథన్ అనే నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో జయం రవి 9 గెటప్పులలో కనిపిస్తాడట. ఈ సినిమాలో ఇందులో కాజల్‌ అగర్వాల్, సంయుక్తా హెగ్డే కథానాయికలు. ఆయన ధరించే ఈ 9 గెటప్పులు, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఒక్కో గెటప్పు ఒక్కో మలుపుకు కారణమవుతూ, కథ ఆసక్తికరంగా కొనసాగుతుందని అంటున్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగు జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ కి కూడా సిద్దమవుతుంది. ఇప్పటికీ దశావతారం తికార్డ్ అలానే ఉంది, పది గెటప్స్ తో ఆ సినిమాని ఇంకెవరూ బ్రేక్ చేయలేదు.

More Related Stories