English   

జక్కన్నతో మహేష్ క్రీజీ కాంబో ప్రకటన

mahesh
2019-05-05 08:53:03

మహేష్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇస్తున్న మహేష్ తన రానున్న ప్రాజెక్ట్స్ గురించి ప్రకటించి సంచలనం రేపారు. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా ఎప్పుడు ఉంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు అతి త్వరలోనే ఉంటుందని ఆయన సమాధానమిచ్చారు. రాజమౌళిగారితో చర్చలు జరుగుతున్నాయని త్వరలో నేనే అన్ని వివరాలు తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు. అలాగే మహర్షి సినిమా తరువాత కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అనుకుంటే సుకుమార్ గారు సీరియస్ గా సాగే ఒక కథను తీసుకొచ్చారని  అందుకే ఆ కథను పక్కన పెట్టేసి, అనిల్ రావిపూడి వినిపించిన వినోదభరితమైన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, మార్పు కోసం తను ఈ కథను ఒప్పుకున్నానని చెప్పినప్పుడు సుకుమార్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో సుకుమార్ తో తప్పకుండా సినిమా ఉంటుందని అయితే అది రాజమౌళిగారి కంటే ముందు సినిమానా ? ఆ తర్వాత సినిమానా అనేది తేలాల్సి ఉంది.

More Related Stories