English   

ఆ సినిమాకి సీక్వెల్ కాదు...పాయల్ క్లారిటీ

payal
2019-05-05 09:10:58

ఆర్ఎక్స్ 100 సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు రాబడి తెచ్చిన ఈ సినిమాలో ఇందుగా నటించిన పాయల్ రాజ్ పుత్ కుర్రకారులో తన ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ సినిమా తరువాత పాయల్ ను వెతుక్కుంటూ వరుస సినిమాలు వస్తున్నాయి. అయితే ఆమె ఏది పడితే అది చేయకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటోంది. ఈ క్రమంలో 'వెంకీమామ' 'డిస్కోరాజా' తరువాత ఆమె మరో సినిమాను అంగీకరించింది. ఆర్డిఎక్స్ లవ్  పేరిట ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా భానుశంకర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే ఈ సినిమా 'ఆర్ ఎక్స్ 100' సినిమాకి సీక్వెల్ అనే ప్రచారం జోరందుకుంది. దాంతో ఈ విషయంపై స్పందించిన పాయల్ ఆర్డిఎక్స్ లవ్ ఈ సినిమా లేడీ ఒరిఎంటేడ్ మూవీ అని ఈ సినిమాకి ఆర్ఎక్స్ 100 సినిమాకి ఎక్కడా ఎలాంటి పోలికలు ఉండవని ఆర్డి ఎక్స్ లవ్ పూర్తిగా వేరే జోనర్‌లో వుంటుందని స్పష్టం చేసింది.

 

More Related Stories