English   

సుకుమార్ సినిమాకి ముహూర్తం పెట్టేశారా

sukumar
2019-05-05 09:53:47

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత ఒక ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మళ్ళీ జోరు పెంచారు. మొత్తం మూడు సినిమాలను లైన్‌లో పెట్టిన అల్లువారబ్బాయి వాటిలో మొదటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే సడన్ గా బన్నీ అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సుకుమార్ తో చేయబోయే సినిమాను ఈనెల 11న ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో 19 వ చిత్రం. ఇక సుకుమార్‌తో ఈ స్టార్ హీరో తన 20వ చిత్రాన్ని చేయనున్నారు. మహేష్ బాబు కోసం సుకుమార్ ఒక స్క్రిప్ట్ ను సిద్ధం చేయగా అది కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ తోనే అల్లు అర్జున్ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న ఈ సినిమా అల్లు అర్జున్  సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడవ సినిమాగా నిలవనుంది.  త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేసే సినిమా షూటింగు పూర్తయిన తరువాత, సుకుమార్ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందట‌.

 

More Related Stories