English   

కబడ్డీ ప్లేయర్ లుక్ కోసం కష్ట పడుతున్న కంగనా

kangana
2019-05-05 10:12:14

బాలీవుడ్ లో బిజీగా ఉన్న వివాదాస్పద హీరోయిన్లలో కంగనా రనౌత్ ఒకరు. గత ఏడాది మణికర్ణిక బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న కంగనకు క్రేజీ ప్రాజెక్టులు వరుసగా ఉన్నాయి. ఆమె నటించిన తాజా సినిమా ’మెంటల్ హై క్యా’ జూన్ లో విడుదల కానుంది. ఆమె ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో నటించేందుకు ఆమె సిద్ధమవుతోంది. అందులో ఒకటి జయలలిత బయోపిక్ కాగా రెండోది స్పోర్ట్స్ డ్రామా ‘పంగా’. ఆమె ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్ పాత్రలో నటించనుంది. అశ్విని అయ్యర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయిందట. ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్ పాత్రను రియలిస్టిక్‌గా పోషించడం కోసం కంగనా ఇప్పటికే కబడ్డీలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటోందట. మరో పక్క శరీరం ఫిజిక్ కోసం జిమ్‌కు వెళ్తూ కూడా కసరత్తులు చేస్తోందట. నిజానికి కబడ్డీ ప్లేయర్స్ కాళ్లు చాలా బలంగా ఉంటాయి. అందుకే కంగనా నిజమైన కబడ్డీ ప్లేయర్ గా కనిపించేందుకు కాళ్ళు బలంగా కనపడడానికి కష్టపడుతోందట. ఈ సినిమా పూర్తయ్యాక జయలలిత బయోపిక్ షూటింగ్ ప్రారంభం అవుతుందట, ఆ సినిమా కోసం ఆమె బరువు పెరగాలని చూస్తున్నారు.

More Related Stories