English   

బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమా చేస్తాడట

mb
2019-05-05 10:27:26

ఎవరైనా బౌండెడ్ స్క్రిప్ట్ తోనే సినిమా చేయాలని, షూటింగ్ లో ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా కొంచెం స్క్రిప్ట్ తో ఒక షెడ్యుల్ చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చి ఇంకో షెడ్యుల్ కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. షూటింగ్ లో స్క్రిప్ట్ గురించి డిస్కర్షన్ ఉండకూడదనేది తన అభిప్రాయమని అందుకే ఇకపై బౌండెడ్ స్క్రిప్ట్స్ తోనే సినిమాలు చేయాలనుకుంటున్ననని ఆయన చెప్పుకొచ్చాడు. ఫెయిల్యుర్స్ నుండి నేర్చుకున్న గుణపాఠం అని గతంలో తాను చేసిన తప్పుల ద్వారా ఈ విషయం రియలైజ్ అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు. బ్రహ్మోత్సవం , స్పైడర్ ఒక ఇరవై నిమిషాల నెరేషన్ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించాయనీ కానీ షూటింగ్ మొదలయిన వెంటనే తెలిసిపోయిందని, మన లోపల భయమే మనకి చెప్పేస్తుందని అందుకే మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకూడదని డిసైడ్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అలాగే కొత్త వారితో సినిమా చేయనని చెప్పను అని కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడానికి ఇష్టపడతాననీ కానీ ఇప్పటివరకు కొత్త దర్శకులు ఎవరు కూడా నన్ను స్క్రిప్ట్ తో వచ్చి కలువలేదనీ కొత్త తరహా సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాననీ సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.

More Related Stories