English   

సీత రిలీజ్ డేట్ లాకయింది

sita
2019-05-05 16:56:34

నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ సరైన హిట్ అయితే అందుకోలేదు. బోయపాటి తెరకెక్కించిన ‘జయ జానకి నాయక’ సినిమా బాగా ఆడినా హీరోగా శ్రీనివాస్‌ కు మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఇక గతే డాది వచ్చిన ‘సాక్ష్యం, కవచం’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలని చూస్తోన్న శ్రీనివాస్ తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తాజా మూవీ సీత. వీరిద్దరూ జంటగా నటించడం ఇది రెండోసారి. సోనూ సూద్ నెగిటివ్ రోల్ పోషించిన ఈ సినిమాకి RX 100 భామ పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇటీవల విడులైన ఈ బుల్లెట్టు మీదోచ్చే బుల్ రెడ్డి పాటకు ప్రేక్షకుల నుంచి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను ఈనెల 24న విడుదల చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు కానీ, అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఫైనల్ గా ఇప్పుడు మే 24ను ఖరారు చేశారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి అయితే పెద్దగా అంచనాలు ఏమీ లేవు చూడాలి ఈ సినిమా అయినా శ్రీనివాస్ కెరీర్ కి ఏమయినా ఉపయోగపడుతుందో లేదో ?

More Related Stories