English   

పూరీ ఇస్మార్ట్...వారణాసి షెడ్యూల్ ప్యాకప్

puri
2019-05-05 20:20:18

సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేయ‌డంలో పూరిని దిట్ట, వర్మ దగ్గర శిష్యరికం చేసి ఆయన కన్నా వేగంగా సినిమాలు తీయడంలో ఆరితేరాడు. తాజాగా ఆయ‌న డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న మూవీ ఇస్మార్ట్ శంక‌ర్‌. రామ్, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూట్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. వారణాసిలో భారీ యాక్షన్‌ సీన్స్‌ను షూట్‌ చేసిన యూనిట్‌.. ఆ షెడ్యూల్‌కు ప్యాకప్‌ చేప్పేసింది. ఇటీవలె వారణాసికి వెళ్లిన చిత్రబృందం అక్కడ భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. నేటితో ఆ షెడ్యూల్‌కు గుడ్‌బై చెప్పినట్లు మరో షెడ్యూల్‌ను రెండు రోజుల్లో హైదరాబాద్‌లోనే స్టార్ట్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు సినిమా సహా నిర్మాత చార్మీ. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని  మే నెలలో విడుదల చేద్దామనుకున్నా కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఈ సినిమానో జూలై లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

More Related Stories