English   

సొంత థియేటర్ లో అవెంజర్స్ చూసిన మహేష్...ఏమన్నాడంటే

mb
2019-05-06 07:24:26

అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకి సామాన్యులే కాక సెలబ్రిటీలు కూడా క్యూ కడుతున్నారు. గత శుక్రవారం నాడు వైసీపీ అధినేత జగన్ అవేంజర్స్ మూవీని హైదరాబాద్‌లో మహేష్ బాబు థియేటర్స్ (ఏఎంబీ సినిమాస్)లో వీక్షించగా. నిన్న తన సొంత థియేటర్ అదే సినిమాని వీక్షించారు మహేష్. ఈ సందర్భంగా మహేశ్ ఏఎంబీ సినిమాస్ థియేటర్ లో తాను చూసిన మొదటి చిత్రం ఇదేనని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అలాగే 'అవెంజర్స్: ఎండ్ గేమ్' చిత్రం చాలా బాగుందని, బాగా ఎంజాయ్ చేశానని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. "థాంక్యూ ఏఎంబీ టీమ్, మీ పనితీరు అద్భుతం" అంటూ తన థియేటర్ సిబ్బందిని అభినందించారు. అంతేగాకుండా, ఏఎంబీ సినిమాస్ స్టాఫ్ తో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. మహేశ్ బాబు ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో హైదరాబాద్ లోని గచ్చీబౌలిలో ఏఎంబీ సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది కొన్ని నెలల క్రితమే ప్రారంభమైంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీ ఈనెల 9న విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. నిన్న కాస్త రిలీఫ్ దొరకడంతో ‘అవేంజర్స్’ సినిమాకి వెళ్లారు. 

More Related Stories