English   

పెళ్లి కార్డు మీద బాలయ్య...ఏమి క్రేజ్ రా నాయనా

balakrishna
2019-05-06 07:42:32

తనకున్నంత మంది అభిమానులు ఏ హీరోకూ లేరని చెబుతూ ఉంటారు నందమూరి బాలకృష్ణ. అప్పుడప్పుడూ ఆయన మాట నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన అనేకసార్లు అభిమానుల మీద చేయి చేసుకుంటూ ఉంటాడు, అయినా ఆయనకు ఏమాత్రం క్రేజ్ తగ్గదు ? కారణం ఆయన మీద పెనవెసుకుపొయీన అభిమానమే. తాజాగా ఆ అభిమానాన్ని వినూత్నంగా చూపాడు కన్నడ రాష్ట్రానికి చెందిన ఒక బాలయ్య అభిమాని. సాధారణంగా అభిమానులు తమకు ఇష్టమైన హీరోలపై ప్రేమను రకరకాలుగా చాటుకుంటారు. సినిమా విడుదలైనప్పుడు పాలాభిషేకాలు చేయడం, ఫ్లెక్సీలు కట్టి హంగామా చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా తమకు తోచినట్లు అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా నందమూరి హీరో బాలయ్యపై కర్ణాటకకు చెందిన శ్రీనివాసులు తన అభిమానాన్ని వినూత్నంగా చూపించాడు.

అదేంటంటే శ్రీనివాసులు ఏకంగా తన కుమారుడి పెళ్లి పత్రిక బాలయ్య ఫోటోలతో సహా ముద్రించాడు. నందమూరి అభిమానులందరూ తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని కోరుతూ పత్రిక మీద అచ్చు వేయించాడు. మే 13న తన కుమారుడి పెళ్లికి బాలయ్య, నందమూరి అభిమానులు హాజరై తన కుమారుడికి ఆశీస్సులు అందించాలని కోరాడు. ప్రస్తుతం ఈ పెళ్లి పత్రికకు సంబంధించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దంపతులకు బాలయ్య బాబు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, మా ఆరాధ్య దైవం బాలయ్య బాబు అంటూ పత్రికపై ముద్రించాడు సదరు బాలయ్య వీర భక్తుడు.

More Related Stories