English   

మహేష్ ని వెయిట్ చేయించిందట !

Meenakshi Dixit
2019-05-06 12:43:18

దేవ‌రాయ‌, అడివికాచిన వెన్నెల‌ లాంటి కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది హీరోయిన్ మీనాక్షి దీక్షిత్‌. ఈ అమ్మ‌డు మ‌హేష్ `దూకుడు`, ఎన్టీఆర్ `బాద్‌షా` సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లో నర్తించినా ఆమెకు అనుకున్న గుర్తింపు దక్కలేదు. అయితే తాజాగా రిలీజ్ కి రెడీ అయిన మహర్షి మూవీలో ఆమె ఒక ఇంపార్టెంట్ రోల్ దక్కింది. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. `మ‌హ‌ర్షి`లో మంచి పాత్ర‌లో యాక్ట్ చేశానని  ఈ పాత్ర త‌న‌కు గుర్తింపు తెస్తుంద‌ని మీనాక్షి చేప్పుకొచ్చింది. తాను డెంగ్యూ, టైఫాయిడ్‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు వంశీ పైడిప‌ల్లి నుండి తనకు కాల్ వచ్చిదని జ్వరం విషయం ఆయనకు చెబితే ఆయన అర్థం చేసుకుని స‌మ‌యం ఇచ్చారనీ అంతా ఓకే అయ్యాక షూటింగ్ మొదటి రోజు న తాను మహేష్ ఎదురు చూసేలా చేశానని చెప్పుకొచ్చింది. లొకేష‌న్‌కు రాగానే  బ్యాగ్ క‌న‌ప‌డ‌లేద నీ నిజానికి తన వ‌స్తువుల‌న్నీ అందులోనే ఉండిపోయాయనీ ఈ విషయం తెలిసి తనకు ఏడుపు వ‌చ్చిందనీ విష‌యం తెలుసుకున్న యూనిట్ స‌భ్యులు కూడా వెతికితే అది క‌న‌ప‌డిందనీ చెప్పుకొచ్చింది. అయితే అప్ప‌టికే సీన్ షూట్ చేయ‌డానికి మ‌హేష్‌ బాబు గారు చాలాసేప‌టి నుండి వెయిట్ చేస్తున్నారనీ ఆయ‌న ద‌గ్గ‌ర‌ కెళ్లి ఇలా   షూటింంగ్ ఆల‌స్య‌మైనందుకు సారీ చెబితే ఆయ‌న ఏమీ ప‌ట్టించుకోకుండా న‌వ్వేశారనీ ఆయన అంత మంచి మనిషి అని మీనాక్షి చెప్పూకొచ్చింది.

More Related Stories