English   

ఈ సారి కూడా సొంత బ్యానర్ లోనే కాకపోతే ?

 Naga Shourya
2019-05-06 14:37:48

ఛ‌లో సినిమా హిట్ కొట్టాక నాగ‌శౌర్య కెరియ‌ర్ కుద‌ట‌ప‌డిన‌ట్లే అని భావించారంతా, అలాంటి సమయంలో న‌ర్త‌న‌శాల సినిమా వ‌చ్చి పెద్ద దెబ్బే కొట్టింది. అయితే గే కామెడీ గాడి త‌ప్పి పెద్ద దెబ్బే కొట్టింది ఆ సినిమా. దీంతో ఆయన చాలా సైలెంట్ అయిపోయాడు. ఛలో ఇచ్చిన నమ్మకంతో  పాటు తెచ్చిపెట్టిన లాభాలని నర్తనశాల మింగేయడంతో సైలెంట్  అయిన నాగశౌర్య త్వరలో సొంత బ్యానర్లో నాగశౌర్య మరో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. మ‌రోసారి కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తూ ఆయ‌న త‌న సింత బ్యాన‌ర్‌ లోనే సినిమా చేయనున్నాడట. ఈ కొత్త సినిమా వ‌చ్చేవార‌మే మొదలు కానుందట. అయితే నర్తనశాల అనుభవాన్ని దృష్టిలో వుంచుకున్న శౌర్య ఈసారి నిర్మాణ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇండస్ట్రీలో పలువురు సీనియర్‌ దర్శకులు, రచయితలకి కథ వినిపించి వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నాడని కూడా అంటున్నారు. ఏదేమైనా ఒక పరాజయం ఎన్ని జాగ్రత్తలు నేర్పిందో కదా.

More Related Stories