English   

గర్భం దాల్చాక ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్ 

Amy Jackson
2019-05-06 15:05:42

అమీ జాక్సన్ అంటే గబుక్కున్న గుర్తు రాదేమో కానీ ఈ మధ్య రిలీజ్ అయిన శంకర్ ‘2.0’లో వసీకరణ్‌కు రోబో అసిస్టెంట్ వెన్నెల అంటే తక్కున గుర్తొస్తుంది. ఈమధ్య ఈ భామ వార్తల్లో నిలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో చాలాకాలంగా అమీ జాక్సన్ డేటింగ్‌లో ఉంది, తాము పెళ్లికి సిద్ధమవుతున్నట్లు, నిశ్చితార్థం చేసుకున్నట్లు ఈ ఏడాది జనవరి 1న అమీ జాక్సన్ ప్రకటించింది. అంతలోనే బ్రిటన్ మదర్స్ డే రోజు తాను తల్లిని కాబోతున్నానని ప్రకటించి షాక్ ఇచ్చింది. ఆమె ఇప్పుడు గర్భం దాల్చాక అధికారికంగా నిశ్చితార్థం చేసుకుంది. తాజాగా జార్జ్‌ పనాయొటో, అమీ జాక్సన్ల నిశ్చితార్థమ్ లండన్‌ లో నిన్న రాత్రి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితులు మధ్య వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిందని తెలుస్తోంది. ఈ వేడుక వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరి పెళ్లి ఎప్పుడు అనేది ఇంకా రూడీ కాలేదు. 

More Related Stories