English   

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ బై చరణ్

Ram Charan
2019-05-06 15:21:30

ప్రతి మనిషి జీవితంలో కొన్ని మరపురాని జ్ఞాపకాలు ఉంటాయి, అందుకు సామాన్యులు. సేలేబ్రిటీలు ఎవరూ మినహాయింపు కాదు. కాకపోతే సామాన్యుల జ్ఞాపకాలు నార్మల్ గా ఉంటె సెలెబ్రిటీల జ్ఞాపకాలు కాస్త రిచ్ గా ఉంటాయేమో ? తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కూడా బాల్యంలో తాను చదివిన స్కూలుకు వెళ్లి, అక్కడ తాను గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని కాస్త ఎమోషనల్భా అయ్యారు. నిజానికి ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అప్పట్లో మద్రాస్ లో ఉండేది, ఏఎన్నార్, ఎన్టీయార్ ల చొరవతో అది హైదరబాద్ కి వచ్చింది. అప్పటికి మద్రాసులో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ ను తమిళనాడులోని లారెన్స్ లవ్ డేల్ స్కూల్లో చదివించారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేయడంతో మిగతా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ఉ లో సాగింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూలుకు వెళ్లిన రామ్ చరణ్ అక్కడి మెస్, డార్మిటరీ, లాన్ వంటి పలు ప్రదేశాల్లో కలియదిరిగి ఆనాటి మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఈ విషయం గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూలు జీవితం మర్చిపోలేదని, తను మళ్లీ చిన్నతనంలోకి వెళ్లిపోయినట్లుందని రామ్ చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ దిగిన ఫొటోలను ఆయన సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

More Related Stories