English   

డిస్కో రాజా తెలివిగా క్లారిటీ ఇచ్చారు 

Disco Raja
2019-05-06 17:33:21

రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమా డిస్కోరాజా‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లవగా బడ్జెట్‌ కారణంగా వచ్చిన విభేదాల వల్ల నిలిచిపోయిందని, ప్రాజెక్ట్‌ క్యాన్సల్‌ అయిందనే పుకార్లు హల్చల్ చేశాయి. అయితే ఈ పుకార్ల మీద సినిమా యూనిట్ తెలివిగా స్పందించింది. డిస్కోరాజా చిత్రం రెండో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించి అన్ని పుకార్లకీ చెక్ పెట్టేసారు. దీన్నిబట్టి షూటింగ్‌ సజావుగా సాగుతోందని, మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌ను మే 27 నుంచి ప్రారంభించనున్నట్లు క్లారిటీ ఇచ్చినట్ట్టు అయ్యింది. సరికొత్త జోనర్ లో రానున్న ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాని రవితేజతో గతంలో నేల టికెట్ అనే సినిమా తీసిన ఎన్నారై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.  

More Related Stories