English   

మే సెంటిమెంట్ ని వాళ్ళిద్దరూ బయట పడేస్తారా ?

Maharshi
2019-05-06 19:21:17

మే నెలలో రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమాలు ఒక్కటి అంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. మహేష్ నటించిన డిజాస్టర్ సినిమాల్లో నాని, నిజం, బ్రహ్మోత్సవం సినిమాలు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి. ఆ సినిమాలు అన్నీ మేలో రిలీజ్ కావడంతో మే నెల మహేష్ కు అచ్చి రాదని ఓ సెంటిమెంట్ గా తయారయ్యింది. అయితే ఇప్పుడు మహర్షి చిత్రం కూడా మే నెలలో రిలీజ్ కానుంది. ఈ దెబ్బకి మహేష్ బాబు అభిమానులు భయపడుతున్నారు. అసలు నిజానికి సినిమాలో కంటెంట్ మాత్రమే సినిమాని హిట్ చేస్తుంది లేకపోతే డిజాస్టర్ ని చేస్తుంది. అయితే మన ఇండస్ట్రీలో సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇక్కడ మరో రెండు సెంటిమెంట్ లు మహేష్ అభిమానులకి కాస్త ఊరటనిస్తున్నాయి. అదే ఒకటి దిల్ రాజు సెంటిమెంట్, మరొకటి వెంకటేష్  సెంటిమెంట్ ముందుగా దిల్ రాజు విషయానికి వస్తే అశ్వనీ దత్ నిర్మించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'మహానటి' మే 9వ తేదీన విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాయి. అలాగే, దిల్ రాజు బ్యానర్‌లో వచ్చిన పరుగు, భద్ర కూడా మంచి హిట్ సాధించాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా హిట్ అవుతుందని అంటున్నారు, ఇక మరోపక్క ఈ మధ్య కాలంలో వెంకటేష్ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరయ్యారు ఒకటి మజిలీ కాగా మరొకటి జెర్సీ. ఈ రెండు సినిమాలు సూపెర్ హిట్స్ గా నిలిచాయి. మరి ఈ సినిమా కూడా ఇదే సెంటిమెంట్ తో హిట్ అవుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories