English   

టాలీవుడ్ నటి ఇంట తీవ్ర విషాదం

sureka
2019-05-06 19:35:24

తెలుగులో పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నటి సురేఖా వాణి భర్త మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త సురేష్ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన చాలా టీవీ షోలకు డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన డైరెక్ట్ చేసే షోలకు సురేఖ యాంకరింగ్ చేసేది. అలా వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో పెద్దలను ఎదిరించి మరీ పెళ్ళి చేసుకున్నారు సురేష్, సురేఖలు. ఇక వీరికి ఒక పాప ఉంది.  సురేష్ తేజ డైరెక్షన్‌లోనే మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలకు సురేఖా వాణి యాంకరింగ్ చేశారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ సినిమా ఛానల్ పోగ్రామింగ్ హెడ్‌గా ఉన్నారు.  సురేష్ మరణ వార్త తెలియగానే సినీ, టీవీ రంగాలకి చెందిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ ప్రగాడ సంతాపం తెలుపుతున్నారు.

More Related Stories