English   

బాలయ్యకు జగపతే విలన్

jag
2019-05-06 20:11:57

గత కొద్దరోజులుగా లెజెండ్ హీరో- విలన్ కాంబో మళ్ళీ రిపీట్ కానుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే చిత్రంలో విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబు ఉన్నట్టు ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. నందమూరి బాల‌కృష్ణ హీరోగా ప్ర‌ముఖ దర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ప్ర‌ముఖ నిర్మాత, సీ కల్యాణ్ ఈ సినిమా నిర్మించ‌నున్నారు. ఈ సినిమాలో బాలయ్య కు సరైన విలన్ గా విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబును ఫిక్స్ అయిన సినిమా యూనిట్ ఆయనను సంప్రదించగ అందుకు ఆయన ఒప్పుకునట్టు సమాచారం. దీంతో ఆయన బాలయ్యకు విల‌న్‌గా రెండో మారు న‌టించ‌బోతున్నారు. ఇక ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత దర్శకత్వం  వహిస్తున్నారు.ఇక ఈ  సినిమా మే 17న లాంఛనంగా ప్రారంభం అవుతుందనీ, జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుందనీ అంటున్నారు.

More Related Stories