English   

జూనియర్ తేజ్ సినిమాకి ఆ టైటిల్

Titled fixed for vaishnav tej movie
2019-05-07 08:01:52

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సముద్రం, జాలర్ల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'జాలరి' అనే టైటిల్ పెట్టనున్నారని ఈ మధ్య బాగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఉప్పెన అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారని అంటున్నారు. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ బేనర్ మీద ఈ సినిమా టైటిల్ ను రిజిస్టర్ చేయించారని దీంతో ఈ సినిమాకి ఉప్పెన అనే టైటిల్ ఫిక్స్ చేశారని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు, ఈరోజు యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ రోల్ లో నటించనున్నాడు. సుకుమార్ రైటింగ్స్ ,మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఇతరత్రా టెక్నీషియన్ల వివరాలు ఇంకా తేలాల్సి ఉంది.

More Related Stories