English   

మరో పాప ఓవర్ నైట్ స్టార్ అయ్యింది  !

Deepika Ghose
2019-05-07 10:59:06

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఫేమస్ అవుతున్నారో చెప్పలేకపోతున్నం. ఈ మధ్య ఈ టిక్ టాక్ ఒకటి వచ్చిందనుకోండి అది అదనపు ఆకర్షణ అన్నమాట. అయితే ఈ శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అక్కడ హంగామా చేసిన ఒక  అందాల భామ ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఎర్ర రంగు టాప్ వేసుకుని ఆర్‌సీబీ జెండా ఊపుతూ ఒకరకంగా జెండాతో పాటు కుర్రాళ్ళ గుండెలను కూడా ఊపేసింది ఆ భామ. గ్యాలరీలో ఎంజాయ్ చేస్తోన్న ఈమెను ఒక అత్యుత్సాహ కెమెరామెన్ లైం లైట్ లోకి తేగా ఆమెకు ఓవర్ నైట్ లో ఆరు వేల మంది ఫాలోవర్ల నుండి ఇరవై ఆరు లక్షల మంది ఫాలోవర్లకి పెరిగిపోయింది. ఆమె గురించి ఒక ఆంగ్ల పత్రిక రాసిన వివరల ప్రకారం దీపికా ఘోష్ అనబడే ఆమె కాలిఫోర్నియాలోని ఓ కళాశాలలో డ్యాన్స్ స్పెషలిస్ట్ అట. బ్యాలెట్, బాలీవుడ్, హిప్‌హాప్‌, జాజ్‌, ఆఫ్రికన్ డ్యాన్స్‌, మోడ్రన్‌ థెరపీ డ్యాన్సుల్లో ఈమెది అందె వేసిన చెయ్యి అట. అనేక ఈవెంట్స్ లో ప్రేక్షకులను అలరించడమే కాక ఇంటరెస్ట్ ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తుందట. అలా ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. పిల్ల బాగానే ఉంది కాబట్టి ఆమెను ఎవరో ఒక దర్శకుడో నిర్మాతో నటించమని అడిగినా ఆశ్చర్యం లేదు.

More Related Stories