English   

పాస్ పోర్ట్ పోగొట్టిన పూరీ హీరోయిన్ 

Nidhhi Agerwal
2019-05-07 11:09:06

అత్యంత వేగంగా సినిమా తీసి రిలీజ్ చేసే దర్శకుల్లో పూరీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది, చాలా ఫ్లాప్స్ అందుకున్న తర్వాత ఆయన ప్రస్తుతం ప్ర‌స్తుతం రామ్‌తో `ఇస్మార్ట్ శంక‌ర్‌` తీస్తున్నారు. అయితే ఆయన ఎంత త్వరగా షూట్ అవగొట్టి సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నా అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా అందులో ఒకరు నిధి అగ‌ర్వాల్‌. ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా దాదాపు టాకీ పార్ట్ పూర్తి కావొస్తుంది. ఓ పాట‌ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ పాట‌ను ఈ నెల‌లోనే యూర‌ప్‌లో  చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. అయితే ఈలోపే నిధి అగ‌ర్వాల్ ఎక్క‌డో త‌న పాస్‌పోర్ట్‌ను పారేసుకుంది. ఇక పాస్ పోర్ట్ రావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి షెడ్యూల్ మారుతుందని అంతా భావించారు. అయితే నిధి అగ‌ర్వాల్ ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా పోలీస్ కంప్లైంట్‌ను ఫైల్ చేసి సంబంధిత పాస్ పోర్ట్ అధికారుల‌ను క‌లిసి త‌న ప‌రిస్థితిని వివ‌రించిండంతో వారు నిధికి త్వ‌ర‌గా కొత్త పాస్ పోర్ట్‌ను వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నారట. దీంతో ఆలస్యం అవుతుందన్న ఇప్పుడు యూర‌ప్ షెడ్యూల్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కార‌మే జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.  

More Related Stories