English   

పవన్ కళ్యాణ్ పాటకు డ్యాన్స్...ఆగలేకపోయిన జెన్నిఫర్ లోపెజ్

The Kings
2019-05-07 12:10:16

పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అనేది పెద్దగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ సినిమా కోసం దేవిశ్రీ అందించిన సంగీతం మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో ఈ సినిమాలోని ఆడేవడన్నా ఈడేవడన్నా సర్దార్ అన్నకి అడ్డేవడన్నా అనేద సాంగ్ కి కొందరు ఇండియన్ కుర్రాళ్ళు చేసిన డ్యాన్స్ అంతర్జాతీయ డ్యాన్సింగ్ సెన్సేషన్, సింగర్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ ను సైతం ముగ్ధురాలిని చేసింది. ఓ అంతర్జాతీయ చానల్ లో ప్రసారమయ్యే వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ అనే ఇంటర్నేషనల్ డ్యాన్స్ రియాల్టీ షోలో జెన్నిఫర్ లోపెజ్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో భారత్ నుంచి ముంబయి కుర్రాళ్లతో కూడిన 'ద కింగ్స్' అనే గ్రూప్ పార్టిసిపేట్ చేస్తోంది. ఫినాలే షో సందర్భంగా 'ద కింగ్స్' సర్దార్ గబ్బర్ సింగ్ లోని 'వాడెవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డెవరన్నా' అనే పాటకు 300 యోధులు సినిమా కాన్సెప్ట్ ను మిక్స్ చేసి అదిరిపోయే రీతిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. స్టేజ్ డ్యాన్స్ అయినా ఆ పాటలో 'ద కింగ్స్' బృందం ప్రదర్శించిన థ్రిల్స్, నాట్య విన్యాసాలు చూసి జెన్నిఫర్ లోపెజ్ సహా ఉన్న మిగతా ఇద్దరు న్యాయ నిర్ణేతలు ఉద్వేగం పట్టలేక తన సీట్లోంచి పైకి లేచి మరీ 'ద కింగ్స్' ప్రదర్శన పట్ల కరతాళ ధ్వనులతో అభినందించారు. ఆ విధంగా పవర్ స్టార్ స్టామినా మరో మరు ఖండాంతరాలకు చేరింది.

More Related Stories