English   

ఆది హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా 

 Aadhi Pinisetty
2019-05-07 13:43:50

ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కోకుండా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తున్న న‌టుడు ఆది పినిశెట్టి. ఒక‌వైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తూనే మ‌రోవైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయ‌న ఓ స్పోర్ట్స్ డ్రామాలో లీడ్ రోల్ గా నటించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. నూత‌న ద‌ర్శ‌కుడు పృథ్వి ఆదిత్య దర్శకత్వలో తెరకెక్కనున్న ఒక అథ్లెటిక్స్‌కు సంబంధించిన సినిమాలో ఆయన నటించనున్నాడు, అయితే ఈ సినిమాలో ఆది అథ్లెట్‌గా క‌నిపిస్తారని, అథ్లెట్‌ గా ఎదిగే క్ర‌మంలో ఒక కుర్రాడు ప‌డే క‌ష్ట‌న‌ష్టాల గురించి వాటిని ఆ కుర్రాడు అధిగ‌మించి త‌న ల‌క్ష్యాన్ని ఎలా చేరుకున్నాడ‌నే అంశాల‌ కలయికతో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. . తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ కినిమనిఒ బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌ మీద ఐబీ కార్తికేయ‌న్ నిర్మిస్తున్నారు. ఇక సినిమాకి సంబంధించిన మిగిలిన నటీనటుల ఎంపిక చేయాల్సి ఉంది. 

More Related Stories