English   

రీమేకా అలాంటిది ఏమీ లేదే ?

Vikram Vedha
2019-05-07 15:00:19

త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ విక్ర‌మ్ వేద‌ను 2017లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. మాధవన్ , విజయ్ సేతుపతి కలిసి నటించిన విక్రమ్ వేద యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో పుష్కర్ – గాయత్రి తెరక్కించగా 100కోట్ల వసూళ్లను రాబట్టింది. అయిర్గే ఈ సినిమాని తెలుగులోకి తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు చాన్నాళ్ళ నుండి ప్రచారం జరుగుతోంది. తాజాగా నిన్నటి కొన్ని వెబ్ సైట్లు ఈ రీమేక్ లో విక్టరీ వెంకటేష్ , నారా రోహిత్ హీరోలుగా నటించనున్నారని మాస డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని కధనాలు వండి వార్చాయి. రీమేక్ ల‌ను తెర‌కెక్కించ‌డం వినాయ‌క్ కు కొట్టిన పిండి అని ఠాగూర్, ఖైదీ నంబ‌ర్ 150 లాంటి సినిమాలను రీమేక్ చేసి సూపర్ హిట్స్ కొట్టారని పేర్కొన్నాయి. దాంతో తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. విక్రమ్ వేద తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన ప్రస్తుతం వెంకీ మామలో మాత్రమే నటిస్తున్నారని త్వరలోనే వెంకీ తదుపరి సినిమాలను ప్రకటిస్తామని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

More Related Stories