English   

మహేష్ మాటలకి బాధలో సుక్కూ ?

Sukumar
2019-05-07 16:40:23

మహర్షి ఆడియో ఫంక్షన్ లో మహేష్ ఈ మధ్య దర్శకులు రెండు నెలలు కూడా ఆగలేక పోతున్నారని అలాంటిది వంశీ తనకోసం రెండేళ్ళు వెయిట్ చేశాడని చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ మహేష్ ఈ మాటలు అన్నది సుకుమార్ గురించేనని అనుకున్నారు. అయితే దీని గురించి మహేష్ తర్వాత ఖండించాడు కూడా, తానూ ఆయన్ని అల అనలేదని నిజానికి ఆయన అంటే తనకు ఎంతో అభిమానమని ఇలా చెప్పుకొచ్చారు. ఈ నేపధ్యంలో సుకుమార్ తన సన్నిహితుల ఆవేదన చెందినట్టు ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ సర్కిల్స్ లో. మహేష్ కోసం తాను ఏడాది పాటు ఎదురు చూశానని స్క్రిప్టు పని కోసం ఏడాది పైగా పట్టినా అది వినడానికి మహేష్ అందుబాటులోకి రావడానికి ఆలస్యం జరిగిందని సుక్కు బాధ పడుతున్నాడట. అంతా సెట్ ఇక సెట్స్ మీదకి వెళ్ళడమే లేట్ అనుకున్న సముంలో మహేష్ అనిల్ రావిపూడితో సినిమా ముందుకు తెచ్చాడని అదయ్యాక తనతో సినిమా చేస్తానని చెప్పాడని సుక్కు, తాను పట్టుపడితే అనిల్ సినిమాను తన సినిమాను ఒకేసారి చేస్తా అన్నారని లుక్ విషయంలో తేడా వస్తుదని తాను ఒప్పుకోలేదని అందుకే వేరే హీరోతో ముందుకు వెళ్తానని మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తోనే సినిమాను క్యాన్సిల్ చేసుకున్నామని అలాంటిది ఇప్పుడు స్టేజ్ మీద తనను ఉద్దేశించి సెటైర్ వేయడం ఏమిటని అయన బాద పడుతున్నాడట.

More Related Stories