English   

లాయర్ తెనాలి రామకృష్ణ.. కేసులివ్వండి ప్లీజ్‌ ?

Sundeep Kishan
2019-05-07 17:09:55

గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తరువాత ఈ హీరో కెరీర్‌లో మళ్లీ ఆ రేంజ్‌ సక్సెస్‌ చూడలేదు. అయినా పట్టు విడవక వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్‌ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్సయిన మనోడు మినిమం గ్యారెంటీ కామెడీ డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డితో ఒక సినిమా చేస్తున్నాడు. తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ అనేది టైటిల్. ఇక ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ లాయర్ గా నటిస్తుండగా ఆయన కు జోడిగా హన్సిక నటిస్తుంది. ఇక ఈ రోజు సందీప్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.  లాయర్‌ గెటప్‌లో తాపీగా కుర్చీపై కూర్చుని చేతులెత్తి దండం పెడుతున్నట్లుగా ఉన్న ఈ లుక్‌ ఫన్నీగా ఉంది. కేసులివ్వండి ప్లీజ్‌’ అన్న ట్యాగ్ లైన్ తో  ఈ ఫస్ట్ లుక్ ఇంట్రస్టింగ్ గా ఉండి సినిమా మీద అంచనాలను తీసుకొచ్చేలా ఉంది. ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సందీప్ ఆయన ‘నిను వీడని నీడను నేనే’ అనే మరో థ్లి్లర్‌ చిత్రంతోనూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో సందీప్‌ నిర్మాతగా మారుతున్నాడు.

More Related Stories